మీ బడ్జెట్ రేంజ్‌లో.. కొత్త ల్యాప్‌టాప్
Inspiron 5567 పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను డెల్ ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు ఎడిషన్‌లలో ఈ ల్యాపీ అందుబాటులో ఉంటుంది. ప్రారంభం వేరియంట్ ధర రూ.39,590.
కేవలం 23.3మిల్లీ మీటర్ల మందపాటి బాడీతో రూపుదిద్దుకున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను లైట్ వెయిట్ అలానే ఈజీ-ఓపెన్ డిజైన్‌గా అభిర్ణించవచ్చు. వివిధ కలర్ వేరియంట్‌లో ఆకట్టకునే విధంగా డిజైన్ కాబడిన ఈ ఇన్స్‌పిరాన్ 5000 సిరీస్ ల్యాప్‌టాప్‌కు ఆప్షనల్ బ్యాక్‌లైట్, బోటమ్ మౌంట్ కీబోర్డ్ వంటి సదుపాయాలు మరింత కంఫర్ట్‌నెస్‌ను కలిగిస్తాయి. ల్యాపీ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి...
15.6 అంగుళాల డిస్‌ప్లే విత్ ఆప్షనల్ ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2ఎక్స్ వైబ్రెంట్ (ట్రుకలర్ రెండరింగ్, రిచ్చర్ గ్రాఫిక్స్), AMD Radeon R7 గ్రాఫిక్స్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 2TB వరకు స్టోరేజ్ కెపాసిటీ, 4జీబి ర్యామ్ వరకు ర్యామ్ కెపాసిటీ, 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్, ఇన్‌బుల్ట్ ఆఫీస్ 2016 (హోమ్ ఎడిషన్ అండ్ స్టూడెంట్ ఎడిషన్), 15 నెలల McAfee సెక్యూరిటీ ఉచితం.
Labels:
Tech News
No comments:
Post a Comment