అరటి పువ్వు వడలు - Arati Puvvu Vadalu
కావలసిన పదార్థాలు: అరటి పువ్వు తరుగు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అరకప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు -1 కప్పు, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 2, మిరియాల పొడి - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, గరం మసాల -1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గుడ్డు - 1, బ్రెడ్ పొడి - తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, పసుపు - చిటికెడు.
తయారుచేసే విధానం: అరటి పువ్వు తరుగు బాగా కడిగి, తగినంత నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగును ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. తర్వాత గరం మసాల, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన పువ్వు తరుగు, బంగాళదుంప గుజ్జు వేసి బాగా కలపాలి. నిమిషం తర్వాత దించేసి చల్లారనివ్వాలి. ఈ ముద్దను కట్‌లెట్స్‌గా చేసుకుని గిలకొట్టిన గుడ్డులో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో దోరగా వేగించాలి. గుడ్డు ఇష్టపడనివారు మైదా జారును వాడవచ్చు. ఈ కట్‌లెట్స్‌కు టమోటా సాస్ మంచి కాంబినేషన్.
No comments:
Post a Comment