బ్రెడ్‌ రొయ్యల పకోడి - Bread Royyala Pakodi




కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు-6, పచ్చిరొయ్యలు-ఒక క ప్పు, గుడ్డు-1, తరిగిన ఉల్లికాడలు-2, అల్లం ముక్కలు-1టీ స్పూను, సోయాసాస్‌-2 టీ స్పూన్లు, మొక్కజొన్నపిండి -1టేబుల్‌ స్పూను, మసాలా పొడి-అరస్పూను, వేగించిన నువ్వులు-అరకప్పు, వేగించడానికి తగినంత నూనె.

తయారుచేసే విధానం: రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్నపిండి, సోయాసాస్‌లను మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని పక్కనుంచుకోవాలి. బ్రెడ్‌ ముక్కల్ని త్రికోణంలో రెండు ముక్కలుగా కట్‌ చేసుకుని ఒక పక్క రొయ్య పేస్టుని రాసి, దానిపై నువ్వులు జల్లి అవి అతుక్కునేలా ఒత్తాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్‌ముక్కని బంగారు రంగు వచ్చేవరకూ వేగించాలి. వీటిని వేడి వేడిగా చిల్లీసాస్‌తో తింటే చాలా బాగుంటాయి

No comments:

Post a Comment