Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

నాసికా రద్దీని తొలగించే ఆయుర్వేద ఔషదాలు

  1. వేడిగా చేసిన అజ్వైన్ ను వాసన చూడండి.
  2. కర్పూరం & అజ్వైన్ కలిపిన వేడి ఆవిరులను పీల్చండి.
  3. నాసికా రద్దీ తొలగించే మరొక ఔషదంగా ఒరేగానో ఆయిల్ పేర్కొనవచ్చు.
  4. విటమిన్ 'C' ని తీసుకుంటూ, హిస్టమిన్ స్థాయిలను చెక్ చేసుకోండి.

Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes

నాసికా రద్దీ లేదా ముక్కులో బ్లాక్ అవటం అనేది ముక్కులో ఉండే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే పొర యొక్క రక్త నాళాలు ఇన్ఫ్లమేషన్ కు గురవటం వలన శ్లేష్మ ఉత్పత్తి అధికమై, తీసుకునే శ్వాస చొరబడకుండా ఉంటుంది. ఈ రకం సమస్య పిల్లలతో పెద్దలలో కూడా గమనించవచ్చు.

సాధారణంగా నాసికా రద్దీని తగ్గించటానికి గానూ ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్, యాంటీ హిస్టమైన్ మరియు డికాంజేస్టంట్స్ వంటి మందులను సిఫార్సు చేస్తారు. ఒకవేళ ఎవరైన రద్దీగా ఉన్న ముక్కు వలన శ్వాస తీసుకొని ఎడల, మ్యూకస్ ను తొలగించటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం అందించవచ్చు. ప్రస్తుతకాలంలో నాసిక రద్దీని తొలగించటానికి ఆయుర్వేద ఔషదాలు ప్రాముఖ్యం పొందాయి. ఎందుకంటే ఇవి విరివిగా లభించటంతో పాటూ, ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించనందు వలన వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో వివిధ రకాల ఆయుర్వేద ఔషదాలు చేర్చబడ్డాయి మరియు శక్తి వంతంగా కూడా పని చేస్తాయి.


నాసికా రద్దీకి ఆయుర్వేద ఔషదాలు :
  • చాలా పురాతనమైన మరియు దాదపు అందరికి తెలిసిన ఆయుర్వేద ఔషదం బిషప్ (అజ్వైన్). కొద్ది మొత్తంలో అజ్వైన్ శుభ్రమైన బట్టలో తీసుకొని, మూసి ఉన్న గిన్నెలో ఉంచి వేడి చేయండి తరువాత దీనిని నుండి వచ్చే వాసనను పీల్చటం వలన మ్యూకస్ తో ముసుకుపోయిన ముక్కు తిరిగి యధాస్థానానికి వస్తుంది.
  • వెల్లుల్లి రసం, తులసి రసం, దంచిన మిరియాలు, లవంగం మరియు నూనె కలిపిన ఆయుర్వేద ఔషదం కూడా నాసికా రద్దీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • కొద్ది చుక్కల కాంఫర్ (కర్పూరం) మరియు అజ్వైన్ కలిప్పిన నీటిని వేడి చేసి దాని నుండి వచ్చే వేడి ఆవిరులను పీల్చండి.
  • ఒక భాగం చెర్రీ బెరడును, ఒక భాగం వైట్ ఓక్ బెరడును కలిపీ వేడి చేసిన నీటిని పీల్చటం వలన నాసికా రద్దీ నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.
  • నాసికా రాద్దీని తొలగించే మరొక ఔషదం ఒరేగానో ఆయిల్. రెండు లేదా మూడు చుక్కల ఒరేగానో ఆయిల్ ను జ్యూస్ లో కలుపుకొని తాగటం వలన నాసికా రద్దీ సమస్యలతో పాటూ, శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • రోజు మూడు సార్లు దాదాపు 1000 గ్రాముల విటమిన్ 'C' ని తీసుకుంటూ హిస్టమిన్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండటం వలన నాసికా రద్దీ నుండి ఉపశమనం పొందవచ్చు.



నాసికా రద్దీకి దూరంగా ఉండటానికి చేయాల్సిన జీవనశైలిలో మార్పులు :
  • పైన తెలిపిన ఆయుర్వేద ఔషదాలతో పాటూ జీవన శైలిలో కొన్ని మార్పులను అనుసరించటం వలన నాసికా రద్దీ వంటి సమస్యలకు దూరంగా ఉండతవచ్చు.
  • ఇలాంటి సమస్యలు కలిగి ఉన్న వారు చల్లటి నీరుకు దూరంగా ఉండాలి మరియు భోజనం తరువాత గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి.
  • కూలర్ లేదా AC లకు దూరంగా ఉండటంతో పాటూ చల్లటి వాతావరణానికి ఎప్పటికపుడు బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • చలి లేదా శీతాకాలంలో చాతి మరియు తల భాగాన్ని ఉన్ని దుస్తువులతో కప్పి ఉంచుకోవాలి.
  • విటమిన్ మరియు మినరల్ లు అధిక మొత్తంలో గల ఆహార పదార్థాలను తీసుకోవటం వలన సహజంగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తి పెరిగి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.


No comments:

Post a Comment