గ్రూప్ 2 పోస్టుల భర్తీకోసం దరఖాస్తుల ... కోరుతోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రోఫార్మా, నిబంధనలు కమిషన వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దరఖాస్తు దారులు ముందుగా తమ బయోడేటా వివరాలను 'One Time Profile Registration(OTPR) ద్వారా కమిషన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడి నెంను అభ్యర్థుల మొబైల్ నెం, ఇమెయిల్ ఐడిలకు పంపుతారు. ఈ OTPR నెం ద్వారానే అభ్యర్థులు గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తులు పంపుకోవాలి.
మొత్తం ఖాళీలు: 982
ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీలు: 442
విభాగాలవారీ ఖాళీలు: మున్సిపల్ కమిషనర్(గ్రేడ్ 3) 12, ఎసిటిఒ 96, సబ్ రిజిసా్ట్రర్(గ్రేడ్ 2) 27, డిప్యూటీ తహసిల్దార్ 253, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 8, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 23, ఎక్స్‌టెన్షన ఆఫీసర్(పంచాయితీరాజ్) 8, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 15
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీలు: 540
విభాగాలవారీ ఖాళీలు: అసిస్టెంట్ సెక్షన ఆఫీసర్ (జిఏడి 67, ఫైనాన్స 16, లా 18, లెజిస్లేచర్ 23), సీనియర్ ఆడిటర్ 45, సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ 82, జిల్లా ఉప సర్వీసులు 158, ఇన్సూరెన్స 1, ఎపిజిఎల్‌ఐ 10), జూనియర్ అకౌంటెంట్ 39, జూనియర్ అసిస్టెంట్ (15 శాఖలు) 81
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరణాత్మక టేబుల్‌ను ప్రకటనలో చూడవచ్చు.
ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వుడ్ వర్గాలవారికి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 25వేల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే స్ర్కీనింగ్ టెస్ట్‌ను ఆఫ్‌లైన విధానంలో నిర్వహిస్తారు.
మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం ఆనలైన విధానంలో మాత్రమే జరుగుతుంది.
అభ్యర్థుల సౌకర్యార్థం మాక్ టెస్ట్‌లను కూడా కమిషన నిర్వహిస్తుంది. వెబ్‌సైట్ మెయిన పేజీలో మాక్ టెస్ట్ ఆప్షన ఉంది. ఎగ్జామ్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశలోని అన్ని జిల్లాలు సహా హైదరాబాద్‌లోను పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన ప్రాసెసింగ్ పీజు కింద రూ.250 + పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాలి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 11 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరుతేదీ: డిసెంబరు 10
స్ర్కీనింగ్ టెస్ట్: 2017 ఫిబ్రవరి 26
మెయిన్స్ ఎగ్జామ్: 2017 మే 20, 21
వెబ్‌సైట్: www.psc.ap.gov.in
Labels:
Job Notification
No comments:
Post a Comment