మొత్తం 23 బ్యాంకులు....24గంటలు అందుబాటులో పూర్తి లావాదేవీలు
నెట్ బ్యాంకింగ్ కంటే కూడా శక్తివంతంగా మొబైల్ యాప్‌తో అతి సులభంగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు సరికొత్తగా ఆల్ బ్యాంక్స్ ఇన్ వన్ యాప్ దూసుకు వచ్చింది. అదే.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (యూపీఐ) యాప్!! మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలున్నా ఒకే ఒక్క వర్చువల్ అడ్ర్‌స్‌తో.. చిటికెలో నగదు బదిలీ, పేమెంట్లు, బిల్లు చెల్లింపులు, బిల్ షేరింగ్స్ వంటివి నిర్వహించుకోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదించిన.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎనపీసీఐ) నేతృత్వంలో అధీకృతంగా అన్ని బ్యాంకులు సపోర్టు చేస్తున్న యాప్ ఇది. బ్యాంకు ఖాతాదారులకు వర్చువల్ అడ్రస్ ఇవ్వటం ద్వారా ఈ యాప్ ద్వారా సులభంగా నగదు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌మొబైల్స్ వినియోగదారులు ఈ యాప్‌ను డౌనలోడ్ చేసుకోవటం ద్వారా కూర్చున్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలన్నింటినీ అతి సులభంగా నిర్వహించుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకోండిలా :
యూపీఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. ముందుగా మీ స్మార్ట్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలి. సెర్చ్‌బాక్స్‌లో యూపీఐ యాప్ అని టైప్ చేయగానే.. అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ యాప్‌ను ఇనస్టాల్ చేయాలి. యాప్‌ను డౌనలోడ్ చేసిన తర్వాత ప్రొఫైల్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పేరు, వర్చువల్ ఐడీ (పేమెంట్ అడ్రస్), పాస్‌వర్డ్ వంటివి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత యూజర్..’ యాడ్/లింగ్/మేనేజ్ బ్యాంక్ అక్కౌంట్ ఆప్షనను ఓపెన చేసి.. వర్చువల్ ఐడీతో మీ బ్యాంకును, అక్కౌంట్ నెంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్స ప్రారంభించటానికి వీలుగా ఎం-పినను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 23 బ్యాంకులు :
దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో మూడొంతులు యూపీఐను రికమెండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా యూపీఐ యాప్ విషయంలో పాలసీతో ఉండటం వల్ల అతిత్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఈ యాప్‌ను రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహార్రాష్ట, కెనరా బ్యాంక్, డీసీబీ బ్యాంక్, క్యాథలిక్ సిరియన బ్యాంక్, కర్నాటక బ్యాంక్, యూనియన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైడెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, టీజేఎ్‌సబీ, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, సౌత ఇండియన బ్యాంక్, హెడ్‌ఎ్‌ఫసీ కెనరా బ్యాంక్ లతో పాటు మరో ఆరు బ్యాంకులు కూడా ఈ సేవలను ప్రారంభించబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా త్వరలో ఈ సేవలను అందించబోతోంది.
24గంటలు అందుబాటులో ఉండే ఈ విధానంలో డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేయకుండానే లావాదేవీలు పూర్తి చేయవచ్చు ఏదైనా రెండు బ్యాంకు అక్కౌంట్ల మధ్య నగదు బదిలీ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నేరుగా బ్యాంకులకు చెల్లింపులు చేయవచ్చు. అత్యంత సురక్షితమైనది. మర్చంట్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ వంటివి నిర్వహించుకోవచ్చు. ఆనలైనలో కొనుగోళ్ళు జరపవచ్చు. బిల్ షేరింగ్ చేయవచ్చు.
Labels:
General Info
No comments:
Post a Comment